మాస్ మహారాజా రవితేజ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఒక్కటే మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. అందులో ధమాకా మూవీ రీసెంట్ గానే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ ను అందించింది. ఇక ప్రస్తుతం రవితేజ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. స్టూవర్ట్ పురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. మొదటిసారి రవితేజ విభిన్నమైన సినిమాతో వస్తుండటంతో ఈసినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఆమధ్య వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉన్నా ఇప్పుడు మాత్రం రవితేజ కూడా తన ఫోకస్ ను పూర్తిగా ఈసినిమాపై పెట్టేశాడు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈసినిమా హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్ కు సంబంధించిన కీలక షెడ్యూల్ ను తాజాగా పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
A MONUMENTAL schedule with a high octane action sequence wrapped up for #TigerNageswaraRao 💥
TIGER HUNT LOADING…🔥
Stay tuned💥@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher @iam_RenuDesai @NupurSanon @gaya3bh @gvprakash @madhie1 @MayankOfficl pic.twitter.com/blZGvADtT2
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) January 12, 2023
కాగా ఈసినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ కెరీర్ లో ఆయన నటిస్తున్న మొట్టమొదటి బయోపిక్ అలానే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: