రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా సంచలన విజయం సాధించింది. ఈసినిమాలో నాటు నాటు రిలీజ్ కు ముందే ఎంత పాపులర్ అయిందో చూశాం. ఇక పాటకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సోషల్ మీడియాలో రీల్స్ కూడా అదే రేంజ్ లో చేశారు. తాజాగా నాటు నాటు సాంగ్ కూడా అంతర్జాతీయ అవార్డ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది ఈపాట. ఈ కార్యక్రమానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి తో పాటు కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక దీనికి గాను దేశవ్యాప్తంగా అందరూ ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రశంసలు కురిపించారు. ఈనేపథ్యంలో ఎన్టీఆర్ కూడా తమకు అవార్డ్ రావడంపై ఆనందాన్ని కురిపిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఇక ఈవీడియో ద్వారా చిత్రయూనిట్ కు అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#RRRMovie #GoldenGlobes @tarak9999 pic.twitter.com/iA8JuWEnEd
— …. (@ynakg2) January 12, 2023
ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాన చేస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు రీసెంట్ గానే కంప్లీట్ అయ్యాయి. ఇక త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నట్టు తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: