మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలయ్య నటించిన సినిమా కావడం, బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్, 5 సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.
భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీస్ స్పెషల్ షోస్ కుఅనుమతి ఇస్తూ, విడుదల రోజున ఆరు షోలకు పర్మిషన్ ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం 12న ఉదయం 4 గంటలకే వీరసింహారెడ్డి షోలు పడనున్నాయి. ఆ మరుసటి రోజే అంటే 13న ఉదయం 4 గంటలకే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య షోలు ప్రారంభం కానున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: