న్యూ ఇయర్ లో హీరో ప్రభాస్ డబుల్ ధమాకా

Prabhas Upcoming Movies 2023,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas,Prabhas Movies,Prabhas New Movies,Prabhas Latest Movies,Prabhas Upcoming Movies,Prabhas New Movie Updates,Prabhas Latest Movie Updates,Prabhas Movie Updates,Prabhas Movie News,Prabhas New Projects,Prabhas Latest Projects,Prabhas Upcoming Projects,Prabhas Next Projects,Prabhas Latest News,Prabhas Movie Updates,Prabhas New Movie News,Prabhas Latest Movie News,2023 Prabhas Upcoming Movies,Prabhas New Projects 2023,Prabhas Latest Projects 2023,Prabhas Upcoming Projects 2023,Project K,Salaar

టి – సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 2వ తేదీ అయోధ్య‌లో ఆదిపురుష్ మూవీ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్పటికే 85 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సలార్ మూవీ తాజా షెడ్యూల్ ఈనెల 8వ తారీకు నుండి ప్రారంభం అయ్యింది. దాదాపు 35 రోజుల పాటు సాగే ఈ భారీ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తి కానుందని సమాచారం. న్యూ ఇయర్ లో హీరో ప్రభాస్ ఆదిపురుష్, సలార్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.