ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అది రామ్ చేసే పాత్రపై. అదేంటంటే.. ఈసినిమాలో వచ్చే ఓ ప్లాష్ బ్యాక్ కోసం రామ్ ఇరవై ఏళ్ల ఎన్ఆర్ఐ కుర్రాడిగా కనిపిస్తాడట. ఈ లుక్ లో రామ్ చాలా కొత్తగా ఫ్రెష్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ యూఎస్ నేపథ్యంలో సాగుతుందని.. సీన్స్ కూడా రొమాంటిక్ టోన్ లో సాగుతాయని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























