శాకుంతలం ట్రైలర్ రిలీజ్

Shaakuntalam Movie Trailer Out Now,Shaakuntalam Trailer Released,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie Updates,Shaakuntalam Telugu Movie Latest News,Shaakuntalam Trailer,Shaakuntalam Movie Trailer,Shaakuntalam Telugu Movie Trailer,Shaakuntalam Official Trailer,Samantha,Latest 2023 Telugu Movie,2023 Telugu Trailers,2023 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2023,2023 Latest Telugu Trailers,Latest Telugu Movies 2023,Telugu Filmnagar,New Telugu Movies 2023,Latest Movie Trailer,Shaakuntalam Theatrical,Shaakuntalam Movie Trailer Out,Samantha New Movie Trailer,Samantha Latest Movie Trailer

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో, విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే యశోద సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని ఈసినిమా ద్వారా చూపించబోతున్నారు. ఇక ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ కి మంచి అనుభవం ఉంది కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దాదాపు మూడేళ్లు ఈసినిమా కోసం కష్టపడ్డారు. ఇక ఫైనల్ గా ఫిబ్రవరి17వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇన్ని రోజులు కాస్త అనారోగ్యంతో బాధపడిన సమంత కోలుకొని ప్రమోషన్ లలో పాల్గొంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలాఉండగా ఎప్పటినుండో అందరూ ఈసినిమా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ ను చేశారు. ఈ భూమి మీద అమ్మా నాన్నలకి అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకి గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది అనే సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది. ఆశ్రమంలో పెరిగే శకుంతల.. తొలిచూపులోనే దుశ్యంత మహారాజు ఆమెని ప్రేమించడం జరుగుతుంది. ఇక వారిద్దరూ ప్రేమించుకోవడం.. ఆతరువాత దుర్వాస మహర్షి శాపం.. అనంతరం శకుంతల ఎదుర్కొనే సమస్యలు, భరతుడి జననం ఇలాంటి నేపథ్యంలో ఒక ఎమోషనల్ జర్నీగా ట్రైలర్ నడిచింది. ట్రైలర్ చివరిలో అల్లు అర్హ ను చూపించారు. ట్రైలర్ ను బట్టి ఈసినిమా ఓ విజువల్ వండగా కనిపిస్తుంది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో, ప్రకాశ్ రాజ్, గౌతమి పలువురు కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + thirteen =