ప్రస్తుతం కన్నడ సినిమాలకు కూడా మండి డిమాండ్ పెరుగుతుంది. కె.జి.యఫ్ తరువాత కన్నడ సినిమాలను ప్రేక్షకులు చూసే దృష్టి మారిపోయింది. దానికి నిదర్శనమే ఆతరువాత వచ్చిన కాంతార సినిమాకు వచ్చిన రెస్పాన్స్. రిషబ్ షెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమా ముందు అక్కడ మాత్రమే రిలీజ్ అయింది. అక్కడ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముందు ఈసినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానివల్ల చాలామందికి తెలిసింది. ఇక ఆతరువాత గీతా ఆర్ట్స్ వారు ఈసినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందించింది. హిందీలో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నేటితో 100 రోజులు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈసినిమా కన్నడలో గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైంది. ఇక నేటితో ఈసినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మేకర్స్ అందుకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ తెలిపారు.
కాగా కర్ణాటక, కేరళలో ఉన్న ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈసినిమాను తెరకెక్కించారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: