ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ మామ మృతి

Lyricist Chandrabose Father In Law Passes Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Lyricist Chandrabose,Lyricist Chandrabose Father,Chandrabose Father,Chandrabose,Chandrabose Father In Law Passes Away,Chandrabose Father In Law,Chandrabose Father In Law Latest News,Chandrabose Father In Law Passes Away News,Lyricist Chandrabose Songs,Lyricist Chandrabose Latest News,Lyricist Chandrabose News,Lyricist Chandrabose Father In Law Passes Away At 92,Chandrabose Father In Law Passed Away,Lyricist Chandrabose Father In Law Chand Basha Passed Away,Chand Basha Passed Away,RIP Chand Basha

గత ఏడాది ఎంతో మంది లెజెండరీ నటీనటులను కోల్పోయింది చిత్రపరిశ్రమ. ఒక్క మహేష్ బాబు కుటుంబంలోనే ముగ్గురు మరణించారు. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు, ఆతరువాత తల్లి ఇందిరా దేవి అనంతరం కొద్దిరోజులకే సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. మరోవైపు రెబల్ స్టార్ కృష్ణంరాజు, రీసెంట్ గా నవరస నటనాసార్వభౌముడు సత్యనారాయణ, అలానే సీనియర్ నటుడు చలపతిరావు ఇలా ఒకరితరువాత ఒకరు మృతిచెందారు. ఇక ఈ ఏడాది అలా మొదలైందో లేదో అప్పుడు మరణ వార్తలు మొదలయ్యాయి. నేడు ప్రముఖ వెటరన్ డాన్స్ మాస్టర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా మృతి చెందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చాంద్ బాషా హైదరాబాద్ మణికొండ లోనే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయనకు 92 ఏళ్లు. ఈనేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా వయసు సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఇక నేడు పరిస్థితి విషమించి కన్నుముశారు. చాంద్ బాషా మృతితో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చంద్రబోస్ ఫ్యామిలీకి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

కాగా చాంద్ బాషా తెలుగు సహా కన్నడ లో కూడా పలు సినిమాలకి సంగీతం అందించారు. తెలుగులో ఖడ్గ తిక్కన, బంగారు సంకెళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు వంటి సినిమాలు చేయగా కన్నడంలో అమర భారతి, చేడిన కిడికి కన్నడ వంటి సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eight =