నిధి అగర్వాల్ హీరోయిన్ గా వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైథాలజీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న చిత్రానికి సునీత్ పడోల్కర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీ. అశోక్, పీ. రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మత్ సర్నా క్లాప్ ఇచ్చారు. హీరోయిన్ నిధి అగర్వాల్ తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. పోస్టర్‌లో నిధి అగర్వాల్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఇప్పటివరకు ఆమె కనిపించని కొత్త అవతార్‌ను పరిచయం చేసేలా ఉంది.
హీరోయిన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దర్శకుడు పవర్ఫుల్ కథ ని సిద్ధం చేశారు.ఈ సినిమా టైటిల్‌తో పాటు మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























