పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది.ధమాకా మూవీ లో హీరో రవితేజ ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ధమాకా మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళు సాధిస్తూ దూసుకుపోతోంది.తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ లో కూడా సూపర్ రన్ తో దూసుకెళ్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధమాకా సక్సెస్ ను మాస్ మీట్ పేరు తో సక్సెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు , హరీశ్ శంకర్ , బండ్ల గణేశ్ హాజరయ్యారు.ఈ సక్సెస్ మీట్ లో హీరో రవితేజ మాట్లాడుతూ ..ధమాకా మూవీ సక్సెస్ కు సంగీత దర్శకుడు భీమ్స్ మొదటి కారణం అనీ , కార్తీక్ ఘట్టమనేని ఫొటోగ్రఫీ వలన ఈ సినిమా తెరపై ఇంత కలర్ ఫుల్ గా కనిపించిందనీ , ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ అనీ , ఇక రెండో కారణంగా నిర్మాతలు .. వాళ్ల అంకితభావాన్ని గురించి చెప్పుకోవాలనీ , ఈ బ్యానర్లో మళ్లీ మళ్లీ పనిచేయాలనిపిస్తోందనీ , మరో కారణంగా రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ పేరు చెప్పాలనీ , ఈ సినిమాలో మీరంతా ఎంజాయ్ చేస్తున్న డైలాగ్స్ ఆయన రాసినవేననీ , ఇక శ్రీలీల టాలెంట్ , గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయనీ, ఇక ఈ బస్ కి డ్రైవర్ త్రినాథరావు అయితే తాను కండక్టర్ అనీ , మీ అందరి సపోర్టు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: