ఫ్యాన్స్ కు రామ్ చరణ్ – ఉపాసన స్పెషల్ థ్యాంక్స్

Ram Charan And Upasana Special Thanks to Their Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan And Upasana Latest News,Ram Charan And Upasana Live Updates,Ram Charan,Upasana,Ram Charan And Upasana Latest Images,Ram Charan And Upasana New Pics,Ram Charan And Upasana Photos

ఈఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా బాగానే కలిసొచ్చింది. ఈ ఏడాది రిలీజ్ అయిన తన ఆర్ఆర్ఆర్ మూవీ రామ్ చరణ్ కు సంచలన విజయం అందించింది. ఈసినిమాతో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు నిచ్చింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో తన తరువాత సినిమా చేయనున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెలకు పదేండ్ల కింద గ్రాండ్ గా వివాహం జరిగింది. ఇక అప్పటి నుండీ రామ్ చరణ్-ఉపాసన ఎప్పుడు పేరెంట్స్ అవుతారా.. ఆ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తాళం వేస్తూ ఈమధ్య చిరు అధికారికంగా ఆ వార్తను తెలియచేశారు. ఇక ఉపాసన కూడా ఆవార్తను తెలియచేసింది. దీంతో అప్పటినుండి ఫ్యాన్స్ అభినందనలు చూపిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా అభిమానులు తమపై చూపించిన ప్రేమకు రామచరణ్ దంపుతులు వారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. బ్యూటీఫుల్ ఫొటోలనున పంచుకుంటూ ‘అందరి ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ క్యాప్షన్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 18 =