పొలిటికల్ ఎంట్రీ పై త్రిష క్లారిటీ

Trisha Clarity About on Her Political Entry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Trisha,Actress Trisha,Heroine Trisha,Trisha Latest News,Actress Trisha About Political Entry,Trisha Comments On Political Entry,Heroine Trisha Shocking Comments on Political Entry,Trisha Sensational Comments On Political Entry

‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమైంది అందాల నటి త్రిష. ఇక అదే ఏడాది వర్షం అనే సినిమాలో శైలజా పాత్రలో చేసిన నటనకు గాను అవార్డులు సైతం దక్కించుకొని అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకున్న అవసరం రాలేదు. ఆ తర్వాత వరుస సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోల పక్కన నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దాదాపు దశాబ్దంన్నర పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. తమిళ్, తెలుగు, మలయాళ, హిందీ సినీ పరిశ్రమల్లో కూడా హీరోయిన్ గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక దీని సెకండ్ పార్ట్ త్వరలోనే రిలీజ్ కావాల్సి ఉంది. ఇంకా పలు ప్రాజెక్ట్ లతో పాటు వెబ్ సిరీస్ లు కూడా త్రిష లిస్ట్ లో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా త్రిష రాజకీయాల్లోకి రానున్నట్లు సోషల్‌ మీడియాలో జోరుగా వార్తలు మొదలయ్యాయి. త్రిష కాంగ్రెస్‌లో చేరుతుందన్న కథనాలు తెరపైకి వచ్చాయి. ఇక ఎట్టకేలకు తాజాగా ఈ వార్తలపై త్రిష స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష దీనిపై మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావడానికి ఒక్క పర్సంట్ కూడా తనకు ఇంట్రెస్ట్ లేదని తెలిపింది. ప్రస్తుతానికి నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పింది. నేను కాంగ్రెస్‌లో చేరుతున్నానన్న వార్తలు నిజం కాదని, సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మొదని క్లారిటీ ఇచ్చారు. మరి దీంతో ఇప్పటికైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 18 =