2022 బెస్ట్ రీమేక్ సినిమా?

2022 Best Remake Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2022,New Telugu Movies 2022,Telugu Movies 2022,Best Remake Movie,Best Remake Movie 2022,Laest Remake Movies,Bheemla Nayak,Bheemla Nayak Movie,Pawan Kalyan,Godfather,Godfather Movie,Megastar Chiranjeevi,Saakini Daakini,Saakini Daakini Movie,Nivetha Thomas,Regina Cassandra,Ori Devuda,Ori Devuda Movie,Mithila Palkar,Vishwak Sen,Gurthunda Seethakalam,Gurthunda Seethakalam Movie,Tamannaah,Satyadev,2022 Best Telugu Remake Movie,Best Telugu Remake Movie,Best Telugu Remake Movie 2022,Best Telugu Remake Movies,Best Telugu Remake Movies 2022,Telugu Remake Movies 2022,Telugu Remakes,Remake Movies 2022,Remake Movies,Best Telugu Movies 2022,Telugu Remake Movies List,POLLL,TFN POLL,Best Remake Movie POLL

2022 సినీ ఇండస్ట్రీకి కాస్త కలిసొచ్చింది. ఈ ఏడాది ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాయి. వాటిలో కొన్ని రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. అన్నీ కలిసి ఈ ఏడాది సినీ ప్రేక్షకులను సందడి చేశాయి. ఇక ఈ ఏడాది పలు రీమేక్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి ఆ రీమేక్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భీమ్లా నాయక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఈ ఏడాది వచ్చిన సినిమా భీమ్లానాయక్. ఈసినిమా మలయాళంలో రిలీజ్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈసినిమాతో పవర్ స్టార్ మరోసారి తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించాడు. సినిమాలో పవన్ నటన కానీ అలానే పవన్-రానా మధ్య వార్ కానీ, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని సినిమాను విజయపథం వైపు నడిపించాయి.

గాడ్ ఫాదర్
మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వచ్చిన సినిమా గాడ్‌ఫాద‌ర్‌. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిపర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈసినిమా. అయితే ఈసినిమా రిలీజ్ కు ముందు ఎలా ఉంటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ సినిమా రిలీజ్ అయి వాటన్నింటిని చేరిపేసింది. పేరుకే లూసిఫర్ రీమేక్ కానీ ఈసినిమా స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.

ఓరి దేవుడా
అశ్వ‌త్ మారిముత్తు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా ఓరి దేవుడా. తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ మై క‌డ‌వులే సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ తన ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకున్నాడు.

గుర్తుందా శీతాకాలం
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా వచ్చిన సినిమా గుర్తుందా శీతాకాలం. ఈసినిమా కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించాడు. ఇక రీసెంట్ గానే రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సత్యదేవ్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది.

2022 బెస్ట్ రీమేక్ సినిమా?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =