టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతకొద్దికాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తాను కోలుకుంటుంది. ఇదిలా ఉండగా ఈమధ్య సమంతపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. సమంత టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు ఆమెపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండిస్తూనే ఉన్నారు. ఈమధ్యనే తన ఆరోగ్యం గురించి కూడా పలు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. సమంత ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వార్తలు రాగా సమంత టీమ్ వాటిని ఖండించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తన సినిమాల గురించి పలు వార్తలు మొదలయ్యాయి. సమంత చేయనున్న సినిమాలు ఆమె చేతినుండి జారిపోయాయని.. పలు ప్రాజెక్ట్ ల నుండి ఆమె తప్పుకుందని వార్తలు తెరపైకి వచ్చాయి. ఇక దీనిపై కూడా సమంత టీమ్ స్పందిస్తూ.. సమంత ఏ ప్రాజెక్ట్ నుండి తప్పుకోలేదు.. ప్రస్తుతం ఆమె రెస్ట్ తీసుకుంటున్నారు.. సంక్రాంతి తరువాత ఆమె శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలిపారు. ఇంకా పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో పాల్గొంటారు అని క్లారిటీ ఇచ్చారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా తన సినిమాలతో అలరిస్తూ వస్తుంది సమంత. ఇక రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత వచ్చిన ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకోవడమే కాకుండా సమంత కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం గుణశేఖర్ తో చేసిన శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇంకా విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేస్తుంది. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























