అన్ స్టాపబుల్ ప్రభాస్ ఫన్ ప్రోమో

Prabhas Unstoppable Promo Released, Prabhas Promo Released, Unstoppable 2 Promo Released, Prabhas Unstoppable 2 Promo, Unstoppable 2 with NBK Promo, Unstoppable 2 Promo, Unstoppable 2 with NBK, Prabhas Unstoppable 2 episode promo, Pan India Star Prabhas, Prabhas Movies, Prabhas Latest Movie, Prabhas Upcoming Movie, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బుల్లితెరపై హోస్ట్ గా కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్టార్ వచ్చేశారు. మరి ఎవరో ఇప్పటికే అర్థమైపోయి ఉంటది కదా ఆ హీరో ఎవరో. డార్లింగ్ ప్రభాస్ ఈ షోకు రావడం జరిగింది. ఈషోకు ప్రభాస్ వచ్చినట్టు రెండు రోజుల నుండే వార్తలు మొదలయ్యాయి. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దీనిలో భాగంగానే ఆ క్యూరియాసిటీని ఇంకాస్త పెంచేలా తాజాగా ప్రోమోను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ షోలో ప్రభాస్ సందడి మాములుగా లేదు. తన స్నేహితుడు గోపిచంద్ తో కలిసి ఈ షోకు వచ్చాడు ప్రభాస్. ప్రోమోలో ప్రభాస్.. గోపిచంద్ తో బాలయ్య అల్లరి అదిరిపోయింది. ప్రభాస్ ను ఓ రేంజ్ లో టీజ్ చేశారు గోపిచంద్. డార్లింగ్‏కు సంబంధించిన పర్సనల్ విషయాలను బయటపెట్టేందుకు గోపిచంద్ ప్రయత్నిస్తుండగా.. ఆపేందుకు ప్రభాస్ ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే.. డార్లింగ్ కు సంబంధించిన ఓ సీక్రెట్ రివీల్ చేసేందుకు గోపిచంద్ ట్రై చేయగా.. ఓరెయ్ అంటూ ఆపే ప్రయత్నం చేశారు ప్రభాస్. ఇక ఆ తర్వాత గోపిచంద్ మీదకు ఏదో విసరడానికి ప్రయత్నిస్తుండగా.. బాలయ్య గోపిచంద్ కు అడ్డుగా నిలబడ్డారు.

ఇంకా సల్మాన్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అని చెప్పుకొచ్చారు. నీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటీ అని అడగ్గా.. డార్లింగ్ రియాక్షన్ అదిరిపోయింది. ఆ తర్వాత డార్లింగ్ గురించి రామ్ చరణ్ కొన్ని సీక్రెట్స్ చెప్పేందుకు ట్రై చేస్తుండగా.. ఓరేయ్ చరణ్.. నువ్వు నా ఫ్రెండా .. శత్రువా అంటూ సరదాగా అడిగారు. చరణ్ లీక్ చేసిన న్యూస్.. రాణి గురించే కదా అంటూ అసలు విషయం బయటపెట్టాడు గోపిచంద్. దీంతో గోపిచంద్ ను కొట్టేందుకు ప్రభాస్ ట్రై చేయగా..బాలయ్య అడ్డు నిలిచాడు. అలాగే మరోసారి బుజ్జిగాడు సినిమాలోని ఫేమస్ డైలాగ్ చెప్పి అలరించాడు డార్లింగ్. చివరగా తన పెద్దనాన్న కృష్ణంరాజును తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు ప్రభాస్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =