వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి విహారానికి అమెరికా టూర్ కి వెళ్ళారు. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో స్టైలిష్‌గా నడిచి వెళ్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెల రోజులపాటు ఎన్టీఆర్ ట్రిప్‌కి వెళ్లినట్లు సన్నిహితుల నుంచీ సమాచారం. దీన్ని బట్టి ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అమెరికాలోనే జరపనున్నారని సమాచారం. సంక్రాంతి పండుగకు ముందు తారక్ ఇండియా రానున్నారు. జనవరి మూడోవారం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం షూటింగ్‌లో పాల్గొనే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న #NTR30 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: