సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను ఈమధ్య మొదలుపెట్టారు. కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. మధ్యలో వివిధ కారణాలతో షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టేలోపు.. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడం జరిగింది. దాంతో షూట్ కు మళ్లీ బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే మహేష్ ఫ్యామిలీ ఆ బాధ నుండి ఇప్పడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక తాజాగా మహేష్ సినిమా షూటింగ్ గురించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ కు అంతా సిద్దమైందని.. వచ్చే ఏడాది జనవరి నుండి నాన్ స్టాప్ గా ఈసినిమా షూటింగ్ ను జరపనున్నామని తెలియచేస్తూ చిత్ర నిర్మామ సంస్థ ట్వీట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
All set to shoot! With heightened spirit and great energy #SSMB28 will go on sets from January, non-stop! Stay-Tuned, More SUPER-EXCITING updates coming your way soon! 🌟✨
SUPERSTAR @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman #PSVinod #ASPrakash @NavinNooli @vamsi84 pic.twitter.com/cEjRFVsz64
— Haarika & Hassine Creations (@haarikahassine) December 10, 2022
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటించారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























