నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ వీర సింహారెడ్డి అనేసినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి జై బాలయ్య అనే పాటను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమాను మొదటి నుండి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దించనున్నట్టు మేకర్స్ తెలుపుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే నేడు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
This Sankranthi gets MASSive with the arrival of the GOD OF MASSES ❤️🔥#VeeraSimhaReddy Grand Worldwide Release on 12th January, 2023 🔥#NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/4BCS7twjz6
— Mythri Movie Makers (@MythriOfficial) December 3, 2022
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.