కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే మాన్‌స్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించాడు వైశాఖ్. ఓ పాప కిడ్నాప్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. డిసెంబర్ 2వ తేదీన ఈసినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈసినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో మంచు లక్ష్మీ కూడా ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈసినిమాతోనే మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇంకా ఈసినిమాలో హనీ రోజ్, సుదేవ్ నాయర్, గణేష్ కుమార్ నటించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈసినిమాను నిర్మించగా.. దీపక్ దేవ్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: