మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. అయితే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నిన్నఈసినిమా నుండి బాస్ పార్టీ అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈపాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. గతంలో చిరు మాస్ లుక్ ను మళ్లీ ఈపాట ద్వారా చూపించారు. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫికి చిరు గ్రేస్ కూడా తోడువ్వడం.. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ తో మంచి మాసీ సాంగ్ గా ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ సాంగ్ పై తనయుడు చరణ్ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. బాస్ ఈజ్ బ్యాక్.. బ్రదర్ డీఎస్పీ ఈ సాంగ్ ఫ్రెష్ గా సూపర్ గా ఉంది. మాస్ అదిరింది అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Boss @KChiruTweets is back in his STRONGEST zone🔥
Brother @ThisIsDSP #BossParty SUPER fresh & MASS!
Adirindhi 👌🧡 #WaltairVeerayya– https://t.co/Tgj645iQXf @RaviTeja_offl @dirbobby @shrutihaasan @UrvashiRautela @MythriOfficial @AzizNakash @Sekharmasteroff @HariPriyaSinger pic.twitter.com/lPEMGai4QQ
— Ram Charan (@AlwaysRamCharan) November 24, 2022
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.