హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ పై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాంతార మూవీ కర్ణాటకలో కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. కాంతార మూవీ కన్నడ వెర్షన్ 168 కోట్ల 50 లక్షలతో అగ్ర స్థానంలో ఉండగా తెలుగు డబ్బింగ్ ఏకంగా 60 కోట్లతో దూసుకుపోతోంది. తమిళనాడులోనూ సుమారు 13 కోట్లు , కేరళలో 19 కోట్లు, హిందీ భాషలలో 96 కోట్లు, ఓవర్సీస్ లో 44 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. సుమారు 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: