పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్?

Ponniyin Selvan 2 Release Date Fixed, PS 2 Release Date Fixed, Ponniyin Selvan 2, Ponniyin Selvan: II, Vikram, Aishwarya Rai, Karthi, Trisha Krishnan, Mani Ratnam, Vikram Latest Movie, Vikram's Upcoming Movie, PS 2, PS 2 2023, PS 2 Movie, PS 2 Update, PS 2 New Update, PS 2 Latest Update, PS 2 Movie Updates, PS 2 Telugu Movie, PS 2 Telugu Movie Latest News, PS 2 Telugu Movie Live Updates, PS 2 Telugu Movie New Update, PS 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. ‘ఓకే బంగారం’ తర్వాత ఇప్పటివరకు ఈయనకు కమర్షియల్‌ హిట్టు లేదు. అయితే చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. నిజానికి ఈసినిమాను ముందు ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆతరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈసినిమా మొదటిభాగం ఇప్పటికే రిలీజ్ అయింది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా భారీ కలెక్షన్స్ ను అందుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని థియేటర్లలో నడుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది రెండో పార్ట్ కోసం. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం రెండో పార్ట్ పై దృష్టి పెడుతున్నారు మేకర్స్. అయితే ఈ పార్ట్ కు సంబంధించిన కీలక పోర్షన్స్ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తుంది. మిగిలిన పార్ట్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా నుంచి తాజా అప్‌డేట్‌ ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే ఈసినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ‘పొన్నియన్‌ సెల్వన్‌ 2’ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇదే కన్ఫామ్ అవుతుందా లేకా మారుతుందా అన్నది తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్, జయం రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ అయింది. ఈసినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =