శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక కొంత కాలం ఈసినిమా షూటింగ్ ఆగిపోగా ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే ఒకపక్క రామ్ చరణ్ సినిమాను అలానే ఇండియన్ 2 సినిమాను పార్లల్ గా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం రామ్ చరణ్ తో ఆర్‌సీ 15 విదేశీ షెడ్యూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఇండియన్2 ఈసినిమా షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే ఈసినిమా షూటింగ్ ఇంకా రెండు నెలల్లో పూర్తవనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈసినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో రెండు సినిమాలను ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేస్తాడా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. మరి శంకర్ కాబట్టి ప్లానింగ్ తో వెళతాడు కాబట్టి అనుకున్న టైమ్ కే ఇండియన్ సినిమా పూర్తి చేస్తాడన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.
కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: