శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ లో యశోద పాత్రలో నటించిన సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యశోద మూవీ కి ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది. ఓవర్సీస్ లో అద్భుత స్పందన తో దూసుకుపోతోన్న యశోద మూవీ 500K డాలర్స్ కు పైగా కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ వన్ మిలియన్ డాలర్ క్లబ్ దిశగా దూసుకుపోతోంది. .యూఎస్ లో సమంతకు అద్భుతమైన రికార్డు ఇప్పటికే ఉంది.సమంత నటించిన 15 సినిమాలు ఇప్పటికే యూఎస్ లో వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరాయి. ఏ ఇండియన్ సినీ హీరోయిన్ కి కూడా ఇంత అద్భుతమైన రికార్డు సొంతం అవ్వలేదు. ఇక ఈ సినిమా తో ఆ సంఖ్య మరింతగా పెరగబోతుందని యశోద సినిమా యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.సమంత మొదటి సారి దూకుడు సినిమా తో యూఎస్ లో వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరారు. ఓబేబీ లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా కూడా మిలియన్ డాలర్లను సొంతం చేసుకుని సౌత్ ఇండియాలో మరే హీరోయిన్ కు దక్కని రికార్డును నమోదు చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: