సమంత చాలా డెడికేటెడ్ యాక్ట్రెస్

unni mukundan about samantha, yashoda movie interesting aspects, Samantha’s Yashoda, U/A certificate, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, Yashoda Movie, Yashoda Update, Yashoda Movie Movie, Yashoda Movie Update, Yashoda Movie New Update, Yashoda Movie Latest Update, Yashoda Movie Movie Updates, Yashoda Movie Telugu Movie, Yashoda Movie Telugu Movie Latest News, Yashoda Movie Telugu Movie Live Updates, Yashoda Movie Telugu Movie New Update, Yashoda Movie Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హరి హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా యశోద. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సరోగసి స్కామ్ ల బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమాపై అంచనాలు ఉండగా.. ఇంకా వీలైనంత వరకూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే పలు ఇంటర్వూల్లో పాల్గొంటున్నారు నటీ నటులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉన్ని ముకుందన్ ఈసినిమా గురించి.. సమంత గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. తెలుగులో మూడు సినిమాలు చేశాను.. ఇప్పుడు యశోద సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నేను సినిమా ఒప్పుకునేప్పుడు.. కథ ఎలా ఉంది.. అందులో నా పాత్ర ఏమిటి.. ఆ పాత్రలో నేను ఎంత వరకూ చేయగలను అన్నది చూస్తాను. ఒక నటుడిగా డిఫరెంట్ పాత్రలు చేయడం.. కొత్త దనం చూపిండటం కూడా ముఖ్యమే. ఇక సమంత విషయానికొస్తే తను చాలా డెడికేటెడ్ యాక్ట్రస్.. తన పాత్ర కోసం ఆమె చాలా ప్రిపేర్ అయ్యారు.. ఫైట్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నింటిలోనూ తను హార్డ్ వర్క్ చేసింది. అందరితో చాలా సరదాగా ఉండేవారు అంటూ తెలిపాడు. ఇంకా సమంత హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. ఈసినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తనకు హెల్త్ ఇష్యూ ఉందని తెలియదు.. దాని గురించి కూడా ఎప్పుడూ చెప్పలేదు.. సెట్ లో చాలా ప్రొఫెషనల్ గా ఉండేవారు.. తన పోస్ట్ చూసి చాలా ఫీలయ్యాను.. తను ఖచ్చితంగా త్వరగా కోలుకుంటుంది అని తెలిపాడు ఉన్ని ముకుందన్.

కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + eleven =