ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందుకే అలాంటి కథలనే ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటుంది. ఈనేపథ్యంలో తెలుగులో వస్తున్న సినిమాలు శాకుంతలం, యశోద. వీటిలో యశోద సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాపై అంచనాలు రోజు రోజుకు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈసినిమాలో పలు ఎలిమెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి. అందులో మొదట సమంత పెర్ఫామెన్స్ మాత్రం ఈసినిమాకు ప్రధాన బలం కానుంది అంటున్నారు. ఇంకా ఈసినిమాలో పలు యాక్షన్ సీక్వెన్స్ లో సమంత అదరగొట్టినట్టు ఇప్పటికే తెలుస్తుండగా.. వాటిలో చేజింగ్ సీక్వెన్స్ మాత్రం థ్రిల్లింగ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సమంత యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆడియన్స్ ను కంటతడి పెట్టేలా ఉంటాయని అంటున్నారు. ఇంకా ఈసినిమాలో ఉన్న ట్విస్ట్ లు కూడా ఓ రేంజ్ లో ఉండబోతున్నాయట.
కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: