రాకేశ్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. చాలా గ్యాప్ తరువాత అల్లు శిరీష్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మంచి హోప్స్ తో ఉన్నాడు అల్లు శిరీష్ కూడా. ఇక ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా సినిమాపై మంచి హైప్ నే క్రియేట్ చేశారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది?.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది..? శిరీష్ కు హిట్ ను అందించిందా లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిషోర్, ఆమని, కేదర్ శంకర్ తదితరులు
దర్శకత్వం.. రాకేశ్ శశి
సమర్పణ..అల్లు అరవింద్
బ్యానర్స్.. జీఏ2 పిక్చర్స్ బ్యానర్
నిర్మాతలు.. ధీరజ్ మొగిలినేని, ఎమ్ విజయ్
సంగీతం..అచ్చు రాజమణి
సినిమాటోగ్రఫి.. తన్వీర్ మీర్
కథ
శ్రీ కుమార్ (అల్లు శిరీష్) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మరోవైపు అదే అఫీసులో జాయిన్ అయిన సింధు (అను ఇమ్మాన్యుయేల్) ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో పడేయటానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనేక ప్రయత్నాల అనంతరం సింధు కూడా శ్రీ కుమార్ కు దగ్గరవుతుంది. దీంతో పెళ్లి చేసుకుందామని శ్రీకుమార్ సింధుని అడుగుతాడు. కానీ సింధు తనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయని.. అవి నేరవేర్చుకోవాలని అనుకుంటన్నానని.. అయితే కొన్నాళ్లు లివ్ ఇన్ రిలేషన్ చేద్దామని అంటుంది. అలా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. కొన్ని నెలల తరువాత మళ్లీ పెళ్లి చేసుకుందామని అడుగగా.. చివరికి నిన్ను ఫ్రెండ్ గా మాత్రమే చూసాను అని చెప్పి షాక్ ఇస్తుంది. దీంతో శ్రీ కుమార్ ఎలా రియాక్ట్ అవుతాడు. శ్రీకుమార్, సింధుజ విడిపోతారా? కలుసుకుంటారా? చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథ..
విశ్లేషణ
లివ్ ఇన్ రిలేషన్ షిప్.. ఈమధ్య యువత ఈ ట్రెండ్ ను బాగానే ఫాలో అవుతున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి పెళ్లి పై ఉన్న అభిప్రాయం ఎలా మారుతుంది.. పెళ్లి ప్రాధాన్యత ఎలా తగ్గుతుంది అనే పాయింట్ మీద ఈసినిమాను తెరకెక్కించాడు రాకేష్ శశి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి.. కలను సాధించాలని ఆలోచించి అడుగులు వేసే అమ్మాయి ప్రేమించుకున్నప్పుడు వారి మధ్య ప్రేమ, ఎమోషన్స్ ఎలా ఉంటాయి. ఎలాంటి గొడవలు వస్తాయి అనే కోణంలో తెరకెక్కించారు. ఈ జనరేషన్ కి తగ్గట్టుగా కథను అందించాడు డైరెక్టర్. ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను తెరకెక్కించడంలోనే డైరెక్టర్ సగం సక్సెస్ అయ్యాడు. అటు, కామెడీ, లవ్, రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ఈసినిమా కనెక్ట్ అవుతుంది.
పెర్ఫామెన్స్
మెగా బ్యాక్ గ్రౌండ్ తో, మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అల్లు శిరీష్. ఇక కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో అలరించిన అల్లు శిరీష్ నుండి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఇక ఈసారి మాత్రం కాస్త జోనర్ మార్చి రొమాంటిక్ ఎంటర్ టైనర్ లోకి వచ్చాడు. ఈసినిమాలో శ్రీ కుమార్‌గా అల్లు శిరీష్ రెచ్చిపోయాడు అని చెప్పొచ్చు. అమాయక వ్యక్తిగా చాలా బాగా చేసాడు. సింధుగా అను ఇమ్మాన్యుయేల్ కూడా చాలా బాగా నటించింది. కేవలం గ్లామర్ పరంగా మాత్రమే కాదు.. మంచి పాత్ర దక్కిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈసినిమాకు అల్లు శిరీష్-అను ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ ప్లస్ పాయింట్ అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో తనకు మంచి రోల్ వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా వెన్నెల కిషోర్, సునీల్, పోసాని కృష్ణ మురళి తమదైన కామెడీ టైమింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఆమని, పెళ్లి ఫేమ్ పృథ్వీ తదితరులు వారి వారి పాత్రల పరిధుల మేరకు నటించారు.
టెక్నికల్ వాల్యూస్
ఇక టెక్నికల్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాకు అచ్చు రాజమణి అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. మరోవైపు చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫి.. తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ బాగుంది. తను అందించిన విజువల్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కు కష్టం కానీ మిగిలిన వర్గాల వారు ఈసినిమా ఒకసారి ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: