పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. పవన్ కెరీర్ లోనే వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో సందడి చేయబోతుండటంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే విడుదలైన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఈసినిమా దాదాపుగా చాలా వరకూ షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చాలా రోజులుగా ఈసినిమా పెండింగ్ షూటింగ్ కు సంబంధించి వర్క్ షాప్స్ నిర్వహించారు. ఇప్పుడు షూటింగ్ ను మొదలుపెట్టేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరిగిపోతుంది. మరి ఈ షూటింగ్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారట. దాదాపు 1000 మందితో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరణ జరుపుతున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: