పోల్ గేమ్ : దీపావళి కి రిలీజ్ కానున్న ఏ మూవీకి మీ ఓటు ?

For which Diwali Release You Are More Excited, Diwali Release Movies, Prince, Sardar, Ginna, Venkatesh Dagubatti, Vishwak Sen, Mithila Palkar, Asha Bhat, Ashwath Marimuthu, Ori Devuda, Ori Devuda Telugu movie, Ori Devuda New Update, Ori Devuda Telugu Movie New Update, Ori Devuda Movie, Ori Devuda Latest Update, Ori Devuda Movie Updates, Ori Devuda Telugu Movie Live Updates, Ori Devuda Telugu Movie Latest News, Ori Devuda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఓరి దేవుడా…!: పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఓరి దేవుడా . ! చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూపర్ హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ తో ప్రేక్షకులను అలరించిన యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ఓరి దేవుడా . ! మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రిన్స్ : సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ , ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ప్రిన్స్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది.పాండిచ్చేరి , లండన్‌ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ప్రిన్స్ మూవీ లో స‌త్య‌రాజ్ కీల‌క పాత్రలో నటించారు. చిత్ర అయిత్ రిలీజ్ చేసిన పోస్ట్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డాక్టర్ జి, డాన్ వంటి సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో శివకార్తికేయన్ ఇప్పుడు ప్రిన్స్ తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

జిన్నా : అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు  మంచు హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పలు కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విష్ణు మంచు తన కామెడీ తో మరోసారి అలరించనున్నారు.

సర్దార్ : ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తీ హీరోగా తెరకెక్కిన స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది . ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవర్ ఫుల్ పోలీస్ కదిరవన్ గా , వయసు మళ్లిన సర్దార్ గా రెండు పాత్రల్లోనూ కార్తీ ప్రేక్షకులను అలరించనున్నారు.

పోల్ గేమ్ : దీపావళి కి రిలీజ్ కానున్న ఏ మూవీకి మీ ఓటు ?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here