ప్రతి ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు ఉంటారు. ఇక టాలీవుడ్ లో కూడా సీనియర్ హీరోలు, అగ్రహీరోలు, స్టార్ హీరోల దగ్గర నుండి యంగ్ హీరోల వరకూ ఎంతో మంది ఉన్నారు. అయితే అందులో కొంత మంది మాత్రమే తమ నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతారు. కొంతమంది హీరోలు కొన్ని ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే పలికించగలరు. అయితే ఏ ఎక్స్ ప్రెషన్ అయినా సరే.. అలానే ఏ పాత్ర అయినా సరే తమ కోసమే పుట్టిందా అన్నట్టు చేసే నటులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఈతరం నటుల్లో ఉన్న నటుడు సత్యదేవ్ అని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు. లూసిఫర్ సినిమాలో వివేక్ ఒబెరాయ్ నటించగా ఆ పాత్రలో సత్యదేవ్ నటించాడు. ఈపాత్ర నెగెటివ్ షేడ్ లో ఉంటుందని అందరికీ తెలుసు. అందులోనూ వివేక్ ఆ పాత్రలో చాలా బాగా నటించి ఓ మార్క్ సెట్ చేశాడు. మరి అలాంటి పాత్రలో నటించాలంటే ఏదో ఒక విలన్ తీసుకొచ్చేసి పెట్టేస్తే సరిపోదు. హడావుడి లేకుండా సెటిల్ట్ గా నటించాలి.. విలనిజం చూపించాలి. క్లాసీగా ఉండాలి.. ఒక్క పాత్రలో ఇన్ని వేరియేషన్స్ చూపించాలంటే మాములు విషయం కాదు.
కానీ సత్యదేవ్ మాత్రం ఆపాత్రను చాలా ఈజ్ తో చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ పాత్రకోసం మెగాస్టార్ కావాలని సత్యదేవ్ ను తీసుకున్నారంటేనే చెప్పొచ్చు తన నటనపై చిరుకి ఎంత నమ్మకం ఉందో. ఇక చిరు పెట్టుకున్న నమ్మకాన్ని తన బ్రిలియంట్ పెర్ఫామెన్స్ తో నిజం చేశాడు సత్యదేవ్. సత్యదేవ్ ను చూసిన తరువాత ఆపాత్రలో మరో నటుడిని ఊహించుకోవడం చాలా కష్టం. అందుకే ఈసినిమాలో చిరంజీవి నటనకి ఎంత గొప్ప పేరొచ్చిందో.. అదే రేంజ్ లో సత్యదేవ్ నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి తో పోటీపడి నటించాలంటే చాలా కష్టమైన విషయం..ఆయన ఎదురుగా నిలబడి తడబడకుండా డైలాగ్స్ చెప్పడం చాలా కష్టతరమైన విషయం. కానీ సత్యదేవ్ చాలా తేలికగా చిరంజీవి తో తలపడే పాత్రని అద్భుతంగా పోషించి సినిమాకి ఆయువుపట్టులాగ నిలిచాడు. మరి ఈసినిమాతో సత్యదేవ్ నటనలో మరో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: