ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఎవరికి వారు తమ సత్తాను చాటుకుంటూ తమ కెరీర్లో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ వారసుడు ఎవరో కాదు.. ఒకప్పుడు ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన బెల్లంకొండ సురేష్ తనయుడు గణేష్. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు తమ్ముడు గణేష్ ఎంట్రీ ఇస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్షన్ లో గణేష్ హీరోగా వస్తున్న సినిమా స్వాతిముత్యం. ఈసినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు గణేష్. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలలో స్పీడ్ పెంచారు. సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ఖచ్చితంగా గణేష్ కు మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ సభ్యులు. అలానే ఈసినిమా నిడివి కూడా తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. మూవీ రన్ టైం 2 గంటల 4 నిముషాలు. ఈసినిమా నిడివి తక్కువగా ఉండడం కూడా దీనికి కలసివచ్చే అంశంగా కనపడుతోంది. చూద్దాం మరి మొదటి సినిమా గణేష్ కు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అందిస్తుందో..
ఇక ఈసినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తుండగా ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకు మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా సూర్య సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: