అలాంటి వార్తలు నేను పట్టించుకోను

Nagarjuna about his political entry, Nagarjuna political entry, Bangarraju, Brahmāstra, political entry, Nagarjuna And Sonal Chauhan's The Ghost, The Ghost Movie, Akkineni Nagarjuna's The Ghost, Praveen Sattaru's The Ghost, Nagarjuna's The Ghost, Nagarjuna's Latest Movie The Ghost, Nagarjuna's Upcoming Telugu Movie The Ghost, Director Praveen Sattaru, Sonal Chauhan, Akkineni Nagarjuna, The Ghost Update, The Ghost Telugu Movie Latest Update, The Ghost, The Ghost Movie Latest News And Updates, The Ghost Movie 2022, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

సినీ సెలబ్రిటీల గురించి రూమర్లు రావడం కామన్ థింగే. అయితే వాటిని కొంతమంది పట్టించుకొని రియాక్ట్ అవుతారు.. కొంతమంది లైట్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు మరో హీరో కూడా తనపై వచ్చే వార్తలను పట్టించుకోను అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు అగ్రహీరో కింగ్ నాగార్జున. ఈఏడాది ఇప్పటికే బంగార్రాజు, బ్రహ్మాస్త్ర సినిమాలతో మంచి హిట్లను తన ఖాతాలో వేసుకున్న నాగార్జున ఇప్పుడు ది ఘోస్ట్ అనే మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలో తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న నాగార్జున తన రాజకీయ రంగ ప్రవేశం పై వస్తున్న వార్తలపై స్పందించారు. గతకొంత కాలంగా నాగార్జున విజయవాడ ఎంపీ స్థానంపై పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు నాగార్జున ఆవార్తలకు క్లారిటీ ఇచ్చారు. గత పదిహేనేళ్లు గా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాంటి వార్తలను పట్టించుకోను అంటూ ఆ వార్తలను ఖండించారు. ఇప్పుడు నాగ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్‌, అనిఖ సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 7 =