మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సుధీర్ బాబు 16వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాకు హంట్.. (గన్స్ డోంట్ లై) అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాలో సుధీర్ తో పాటు శ్రీకాంత్, తమిళ హీరో భరత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ ముగ్గురి క్యారెక్టర్ పోస్టర్లు విడుదల చేశారు. పోస్టర్లు మాత్రం అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిజానికి ఈసినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అవ్వాలి. ఈ రోజు ఉదయం 11.33 గంటలకు టీజర్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఏఎంబీ మాల్లో టీజర్ రిలీజ్ కార్యక్రమానికి కూడా అంతా సిద్ధం చేశారు. కానీ ఇప్పుడు ఈసినిమా టీజర్ రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి సుధీర్ బాబు అత్తయ్య అయిన ఇందిరా దేవి గారు నేడు తుదిశ్వాస విడిచారు. దీంతో లాస్ట్ మినిట్ లో టీజర్ రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్.
కాగా ఈసినిమాలో అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు, మోహన్ భార్గవ్ పాత్రలో శ్రీకాంత్, దేవ్‌గా భరత్ నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి చూస్తుంటే ఈసారి సుధీర్ బాబు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడని అనిపిస్తుంది. చూద్దాం మరి ఈసినిమా ఎలా ఉండబోతుందో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: