కొత్త రిలీజ్ డేట్ లాక్ చేసిన జిన్నా

Ginna Movie New Release Date Locked, Eeshaan Suryaah, Ginna Movie New Release Date, Ginna Telugu Movie New Release Date, Ginna Movie Latest News And Updates, Ginna Movie Update, Ginna Movie, Ginna Telugu Movie New Update, Latest Telugu Movies News, Manchu Vishnu Ginna Telugu Movie, Payal Rajput, Sunny Leone, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Vishnu Manchu’s 19th movie Ginna, Vishnu Manchu’s Ginna, Vishnu Manchu’s Latest Movie, Vishnu Manchu’s Upcoming Movie

చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంతేకాదు ఈసినిమా నుండి గత కొంత కాలంగా ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే వస్తున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా మంచు విష్ణు కూడా ఈసినిమాపై బాగానే బజ్ క్రియేట్ చేశాడు. దానికి తోడు రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. కానీ కొద్దిరోజులుగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో రిలీజ్ డేట్ పై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు దీనిపై కూడా క్లారిటీ వచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. నిజానికి అక్టోబర్ 5వ తేదీన ఈసినిమా రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. కానీ ఆ రోజుల రిలీజ్ కు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లాంటి పెద్ద సినిమాలతో పాటు ఇంకా పలు సినిమాలు కూడా రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. దీంతో ఈసినిమా రిలీజ్ డేట్ మార్చుతారన్న వార్తలు వచ్చాయి. ఇక దీనిపై మంచు విష్ణునే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న మంచు విష్ణు సినిమా రిలీజ్ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. జిన్నా సినిమాను పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా, ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించామని.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా అలరిస్తుందని.. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ముందుగా అనుకున్నట్లుగా అక్టోబర్ 5న కాకుండా, అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే అక్టోబర్ 5న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − one =