అదే సస్పెన్స్ లో ఎన్టీఆర్ 30

#NTR30 Movie Interesting Update, NTR30 Telugu Movie Interesting Update, Jr NTR's Next Film, #NTR30, #NTR30 Movie, NTR30, Koratala Siva, Jr NTR, RRR, NTR30 Latest Update, NTR30 Movie, NTR30 Telugu movie, NTR30 Latest Update, NTR30 Telugu Movie New Update, NTR30 Movie Latest News And Updates, NTR30 Movie Updates, NTR30 Telugu Movie Live Updates, NTR30 Telugu Movie Latest News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడి సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాకోసం నాలుగేళ్లు టైమ్ అయిపోయింది. ఫైనల్ గా ఈ ఏడాది ఈసినిమా రిలీజ్ అయిపోయి సంచలన విజయం సాధించింది. ఇక ఈసినిమా అయిపోయింది కదా తన తరువాత సినిమాలు మొదలుపెట్టేస్తాడులే అనుకున్నారు అందరూ. కానీ అది ఇంతవరకూ జరగలేదు. మరోపక్క అదే ఆర్ఆర్ఆర్ లో చేసిన రామ్ చరణ్ తన కొత్త సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ కూడా షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతాడా అని చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ఆమధ్య ఈసినిమాకు ఒక నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తారక్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది.. దీంతో చిత్రయూనిట్ ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించాలని చూస్తున్నారని తెలిపారు. ఫైనల్ గా సెప్టెంబర్ నుండి ఈసినిమా సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పలు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్ కూడా అయిపోతుంది. ఇంకా ఈసినిమాపై అదే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కన్ఫర్మ్ కాలేదు. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అన్నది తెలియాలంటే మేకర్స్ మాత్రమే క్లారిటీ ఇవ్వాలి.

కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. మరి జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో ఇప్పటినుండే ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =