రవితేజ ధమాకా షూటింగ్ కంప్లీట్

Ravi Teja’s Dhamaka movie shoot wrapped up, Dhamaka movie shoot wrapped up, Dhamaka Latest Updates, Dhamaka Movie Shooting Updates, Dhamaka Shoot Schedule Updates, Mass Maharaj Ravi Teja, Mass Maharaj Ravi Teja Movie Updates, Mass Maharaj Ravi Teja’s Dhamaka Movie Latest Update, Ravi Teja, Ravi Teja Dhamaka Movie updates, Ravi Teja Latest Movie, Ravi Teja New Movie Updates, Ravi Teja Upcoming Movie Dhamaka, Ravi Teja Upcoming Movies, Sree Leela and Ravi Teja Movie Dhamaka, Dhamaka, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest News, Tollywood Movie Updates, Latest Telugu Movies News

మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. ప్రస్తుతం నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ధమాకా. ఇక ఇన్ని రోజులు షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌లు, పాటలు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసినట్లు ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన ఓ వీడియోను మేకర్స్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. వీడియోలో షూటింగ్‌ పూర్తైన సందర్భంగా పటాకులు పేలుస్తూ సంబురాలు చేసుకున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ రానున్నట్లు వెల్లడించారు.

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు.

మరి ఇప్పటికే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. సరైన విజయాన్ని అందుకోలేకపోయాయి. అయినా కూడా రవితేజ నిరాశ చెందకుండా తన తరువాత సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =