మాస్ మహారాజా రవితేజ హీరోగా ధమాకా ! , రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతున్న MEGA 154 మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా షూటింగ్ ముగింపు దశలో ఉంది.భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ జింతాక్ , గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధమాకా మూవీ నుండి ఒక ఆన్ లొకేషన్ పిక్ బయటకు వచ్చింది. ఈ పిక్ లో హీరోయిన్ శ్రీలీల, దర్శకుడు త్రినాధరావు తో పాటు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో పాటు మరికొందరు టీమ్ సభ్యులతో మాస్ మహా రాజా రవితేజ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. టీమ్ మొత్తం అందరూ ఎంతో కష్టపడి వర్క్ చేస్తున్న ధమాకా మూవీ రిలీజ్ తరువాత తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: