లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విజువల్ వండర్‌గా.. భారీ క్యాస్ట్‌తో.. భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా అందులో మొదటి పార్ట్ సెప్టెంబర్ 30 తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ కూడా సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈసందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తి ఈసినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. పొన్నియిన్ సెల్వన్ సినిమా కూడా పీరియాడిక్ సినిమా అయితే ఈసినిమాకు మిగిలిన పీరియాడిక్ సినిమాలకు తేడా ఉంది. మాములుగా పీరియాడిక్ సినిమాల్లో విఎఫ్ఎక్స్ లు, సెట్ లు ఎక్కువగా ఉంటాయి.. కానీ ఈసినిమాలో వాటికి ఎక్కువ ప్రాధాన్యత లేకుండా రియలిస్టిక్‌గా ఉంటుంది అని తెలిపాడు. హిస్టారికల్, లైవ్ లొకేషన్స్ లో చిత్రీకరించేందుకు ప్రయత్నించామని, కథకు ఓ ప్రత్యేకత ఉందని కార్తి తెలిపాడు.
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ అవుతుంది. చూద్దాం మరి ఈసినిమా మణిరత్నంకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























