ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో శ్రీవిష్ణు

Sree Vishnu To Be Part of an International Project, Actor Sree Vishnu To Be Part of an International Project, International Project, Actor Sree Vishnu Will Work International Project, Sree Vishnu's International Project, Alluri Telugu Movie Review, Alluri Movie Review, Alluri Review, Alluri Telugu Review, Alluri First Review, Alluri Movie Review And Rating, Alluri Critics Review, Alluri Story review, Alluri Movie Highlights, Alluri Movie Plus Points, Alluri Movie Public Talk, Alluri Movie Public Response, Alluri, Alluri Movie, Alluri Movie Updates, Alluri Telugu Movie Updates, Alluri Telugu Movie Live Updates, Alluri Telugu Movie Latest News, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News

సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ప్రస్తుతం శ్రీవిష్ణు నుండి వస్తున్న సినిమా అల్లూరి. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈసినిమా ఈనెల 23వ తేదీన రిలీజ్ కానున్న
ప్రస్తుతం శ్రీవిష్ణు తన కొత్త సినిమా అల్లూరి ప్రమోషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈసందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు శ్రీవిష్ణు. ఈనేపథ్యంలో తన తరువాత సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటి వరకూ తెలుగులో మాత్రమే సందడి చేసిన శ్రీవిష్ణు ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్ లో భాగమవ్వడం గొప్ప విషయం. ఈవిషయాన్ని శ్రీవిష్ణునే స్వయంగా చెప్పడం జరిగింది. ఓ యూరోపియ‌న్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ తో క‌లిసి ఈ సినిమా చేస్తున్నాను. ఇందులో చాలా పెద్ద పెద్ద న‌టీన‌టులు ఉంటారు. వాళ్ల‌తో క‌లిసి నేనూ న‌టిస్తున్నాను. ఈ సినిమాలోని ప్ర‌తీ ఒక్క క్యారెక్ట‌ర్ ఒక్కో భాష మాట్లాడుతుంది. నేను మాత్రం తెలుగులోనే మాట్లాడ‌తా. ఇతరు నటులు వారి ఒరిజినల్ లాంగ్వేజస్ లో మాట్లాడతారు పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్ సినిమా అని చెప్పడం కష్టం.. అన్ని ప్రాంతాల వారికీ క‌నెక్ట్ అయ్యే క‌థ‌తో ఈ సినిమా చేస్తున్నాం. త్వ‌ర‌లోనే ఈ సినిమా విష‌యాల్ని అధికారికంగా చెబుతా అని తెలిపారు.

కాగా కయ్యదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, మధుసూధన్ రావు, జయవాణి తదితరులు నటిస్తున్నారు. యాక్షన్ ఎమోష‌న‌ల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాను ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించ‌నున్నారు. ఈ సినిమాకు హ‌ర్షవ‌ర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =