డిసెంబర్ బరిలోకి ఇప్పటినుండే పలు సినిమాలు లిస్ట్ లోకి చేరుతున్నాయి. ఇప్పటికే హిట్ సీక్వెల్ గా వస్తున్న హిట్2 సినిమాను డిసెంబర్ లో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా చేరిపోయింది. ఆసినిమా మరేదో కాదు ధనుష్ హీరోగా వస్తున్న సార్ సినిమా. ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో అలరించిన ధనుష్ ఇప్పుడు స్ట్రైయిట్ గా తెలుగులో నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్‌గా నటించనున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కార్పొరేట్ విద్యా వ్యవస్థ నిరుపేదలకు చదువును ఎలా దూరం చేస్తుందనే అంశంపై ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు టీజర్ ను బట్టి ఇప్పటికే రుజువు చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Mark the Date. Our #Vaathi / #SIR is getting ready to take classes from 2nd Dec 2022! 📕🖊️✨ #SIRMovieOn2ndDec #VaathiOn2ndDec @dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya @Fortune4Cinemas @SitharaEnts #SrikaraStudios pic.twitter.com/mBvDl8b5cM
— Sithara Entertainments (@SitharaEnts) September 19, 2022
కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భరణి , నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: