పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు తన సతీమణి నమ్రత తో పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వారు చేనేత మహిళలకు చేయూత ను అందించారు. తెలంగాణలోని నారాయణపేట ప్రాంతంలో ఉన్న మహిళా సంఘాలు నిర్వహిస్తున్న చేనేత వస్త్రాల వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జంట ముందుకొచ్చింది. నారాయణపేటలోని చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఆరుణ్య నారాయణపేట పేరుతో ఆన్‌లైన్ వస్త్రాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహిళలే తమ చేనేత వృత్తి నైపుణ్యాలకు పదునుపెడుతూ నేసిన వస్త్రాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా విక్రయించడం ద్వారా తమ కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు మహిళా సాధికారతకు పాటుపడుతున్నారు. మహిళల అభ్యుదయం కోసం మహిళలే కృషిచేస్తున్న ఈ సంస్థ ప్రతినిధులు తాజాగా మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ను కలిశారు. తమను కలిసిన చేనేత మహిళలను అభినందించిన మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ వారిని ప్రోత్సహించడమే కాకుండా వారి కృషిని ప్రశంసించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తమ కాళ్లపై తాము నిలబడుతూనే.. అదే సమయంలో చేనేత వృత్తిని మరో స్థాయికి తీసుకెళ్లడం గొప్ప విషయని మహేష్ బాబు చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























