ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈ కాంబినేషన్ పై ముందు నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఈసినిమా నుండి ఇచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఇక భారీ అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది? సుధీర్ బాబుకు ఈసినిమా హిట్ ను అందించిందా లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గోపరాజు రమణ
దర్శకత్వం.. ఇంద్రగంటి మోహన కృష్ణ
బ్యానర్స్.. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు.. మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి
సంగీతం.. వివేక్ సాగర్
సినిమాటోగ్రఫి.. పిజి విందా
కథ
నవీన్ ( సుధీర్ బాబు) ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్. వరుసగా ఆరు హిట్లు కొట్టి మంచి ఫామ్ లో ఉంటాడు. ఇక తన తరువాత సినిమా కోసం ఒక హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతున్న సమయంలోనే డాక్టర్ అలేఖ్య ( కృతీ శెట్టి ) కి సంబంధించిన ఒక చిన్న వీడియోను చూస్తాడు. ఇక ఆవీడియో చూసి ఇంప్రెస్ అయిన నవీన్ ఆమెను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలనుకుంటాడు. కానీ ఆమె నటించడం హీరోయిన్ తల్లి తండ్రులకు ఇష్టం ఉండదు. మరి ఆమెతో తాను సినిమా చేస్తే ఎలా ఒప్పించి చేస్తాడు? ఆ ప్రపోజల్ కి అలేఖ్య కుటుంబం ఏం చెప్తారు? సినిమాలంటే ఇష్టంలేని అమ్మాయి.. చివరకు ఎందుకు సినిమాలో నటించింది? ఆమె ఎలా కన్విన్స్ అవుతుంది? ఈ సినిమా వల్ల ఆమెకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ..
ఇంద్రగంటి మోహనకృష్ణ-సుధీర్ బాబు కాంబినేషన్ లో ఇప్పటివరకూ సమ్మోహనం అలానే వి సినిమాలు వచ్చాయి. సమ్మోహనం సినిమాలో కూల్ అండ్ ప్లజంట్ రోల్ చేస్తే వి సినిమాలో పోలీస్ గా చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి ప్రేమకథతో వచ్చాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఈసారి మరో డీసెంట్ సబ్జెక్ట్ తో వచ్చారని చెప్పాలి. అంతేకాదు మొదటిసారి ఈసినిమాలో ఇంద్రగంటి తన మార్క్ ను కాకుండా కొత్తగా ట్రై చేసినట్టు కనిపిస్తుంది. కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా తన కథలో జోడించాడు. అంతేకాదు ఈసినిమాతో ఇంద్రగంటి ఇండస్ట్రీలో జరిగే కొన్ని ఇష్యూస్ ను కూడా టచ్ చేసినట్టు తెలుస్తుంది. క్యాస్టింగ్ కౌచ్, గాసిప్పులు, వాటి వల్ల సెలెబ్రిటీల ఫ్యామిలీలపై పడే ప్రభావాన్ని ఇలా కొన్ని సమస్యలను కూడా చూపించాడు.
సుధీర్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ఈ సినిమాలో కూడా సుధీర్ కోసం మంచి పాత్రని ఇంద్రగంటి డిజైన్ చేశాడు. అందులోనూ ఇలాంటి రోల్ లో ఇప్పటికే చేసిన ఎక్స్ పీరియన్స్ కూడా ఉంది. సమ్మోహనం సినిమాలో కూడా సుదీర్ రోల్ దాదాపు ఇలానే సాఫ్ట్ గా సెటిల్డ్ గా ఉంటుంది. దాంతో ఈసినిమాలో కూడా తన సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాపై ప్యాషన్ కలిగిన ఓ స్టైలిష్ యంగ్ డైరెక్టర్ గా.. అలానే కొన్ని ఎమోషన్ సీన్స్ లో కూడా బాగా నటించాడు. అంతేకాదు ఈసినిమాలో లాంగ్ హెయిర్, గడ్డంతో తన బాడీ లాంగ్వేజ్ తో ఉన్న కొత్త మేకోవర్ కూడా ఆకట్టుకుంటుంది. కృతి శెట్టి కి తన గత చిత్రాలతో పోలిస్తే ఈసినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పాలి. కృతిశెట్టి కూడా అంతే పర్ఫెక్ట్ గా నటించింది. సుధీర్ బాబుకు పోటీగా నటించిందని చెప్పొచ్చు. అంతేకాకుండా సుదీర్ బాబుతో కృతి శెట్టితో కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు అనిపించింది. వెన్నెల కిషోర్ కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్ తనకు అలవాటైన రీతిలో నటించేశాడు. మిగిలిన పాత్రలో అందరూ తమ పరిధి మేరకు నటించేశారు.
సాంకేతిక విభాగానికి వస్తే వివేక్ సాగర్ తన సంగీతంతో సినిమాకి ప్రాణం పోసాడు. ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అందులోనూ వివేక్ సాగర్ ఒక సోల్ లాంటి మ్యూజిక్ ను ఇవ్వడంలో ఎక్స్పర్ట్ . అలానే మరోసారి మంచి మ్యూజిక్ ని ఈసినిమాకు అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈసినిమాను నిర్మించారు.
ఓవరాల్ గా చెప్పాలంటే సమ్మోహనం తరువాత ఇంద్రగంటి-సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మరో డీసెంట్ సినిమా అని చెప్పొచ్చు. ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది. అందరూ ఒకసారి ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: