పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో ఆర్య , ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. థింక్ స్టూడియోస్, ది స్నో పీపుల్ బ్యానర్స్ పై శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఆర్య , ఐశ్వర్య లక్ష్మి జంటగా ఒక వింత జీవి పోరాటం నేపథ్యం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ కెప్టెన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ సెప్టెంబర్ 8వ తేదీ రిలీజ్ కానున్నాయి.సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి డి ఇమాన్ సంగీతం అందించారు. కెప్టెన్ మూవీ తెలుగు వెర్షన్ ను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అండ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కెప్టెన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో ఆర్య మాట్లాడుతూ .. కెప్టెన్ ఒక స్పెషల్ ఫిల్మ్ అనీ , ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందనీ , ఈ మూవీ ని దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ అద్భుతంగా తెరకెక్కించారనీ , ఈ మూవీ డైలాగ్స్ , మ్యూజిక్ ప్రేక్షకులను అలరిస్తాయనీ , విక్రమ్ మూవీ లా కెప్టెన్ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందనీ , తెలుగు అభిమానులకు థ్యాంక్స్ అనీ , మీ సపోర్ట్ కావాలనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: