పొన్నియన్ సెల్వన్ తెలుగు ట్రైలర్ రిలీజ్

Ponniyan Selvan Telugu Trailer Released, PS-1 Telugu Trailer Released, Ponniyan Selvan Telugu Trailer, Ponniyan Selvan Trailer, Ponniyin Selvan-1, PS-1 Telugu Trailer, 4 Actors Voices For Ponniyin Selvan 1 Movie Trailer, Ponniyin Selvan 1 Movie Trailer, Ponniyin Selvan 1 Movie, Ponniyin Selvan 1 Trailer, Ponniyin Selvan 1 Telugu Movie Trailer, Ponniyin Selvan 1 Movie, Ponniyin Selvan 1 Telugu Movie, 4 Actors, Mani Ratnam's Ponniyin Selvan-1, Ponniyin Selvan-1 Latest Update, Ponniyin Selvan-1 Movie New Update, Ponniyin Selvan 1 Telugu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను విజువల్ వండర్‌గా.. భారీ క్యాస్ట్‌తో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా అందులో మొదటి పార్ట్ సెప్టెంబర్ 30 తేదీన రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్స్ ను భారీగా చేస్తున్నాడు మణిరత్నం. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు అలానే టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా కూడా విజువల్ వండర్ గా ఉండబోతుందని ఇప్పటికే టీజర్ చూస్తే అర్థమయిపోయింది. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ తో మరోసారి సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈ ట్రైలర్ కు తమిళంలో కమల్ హాసన్, తెలుగులో రానా దగ్గుబాటి, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, హిందీలో అనిల్ కపూర్, కన్నడలో జయంత్ కైకిని వాయిస్ ఓవర్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ విషయానికొస్తే వెయ్యి సంవత్సరాల క్రితం చోళ నాట స్వర్ణ శకం ఉదయించక మునుపు… ఒక తోక చుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళ రాజకులంలో ఒకరిని ఆ తోక చుక్క బలి కోరుతుందని అంటున్నారు. దేశాన్ని పగలు, ప్రతీకారాలు చుట్టుముట్టాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. వంచన, ద్రోహం రాజ మందిరంలోకి చొచ్చుకుని పోతున్నాయి” అంటూ రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్ తో ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్ ప్రారంభం అయ్యింది. ఇంకా ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ ను పరిచయం చేశారు. తర్వాత ‘చోళ రాజ్య రక్షకుడిని. చోళ రాజ్య సేవకుడిని’ అంటూ ‘జయం’ రవి పాత్రను చూపించాడు. కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్ ఇలా ఒక్కొక్కరి పాత్రను పరిచయం చేస్తుంటే వాళ్ళ నటనతో పాటు సినిమా ఎంత గ్రాండియర్ గా ఉంటుందో అర్థమవుతుంది. మొత్తానికి ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ అవుతుంది. చూద్దాం మరి ఈసినిమా మణిరత్నంకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =