‘శాకిని డాకిని’ అందరినీ అలరిస్తారు

Regina and Nivetha Thomas about Saakini Daakini movie, Latest Telugu Movies News, Nivetha Thomas, Nivetha Thomas And Regina Cassandra Movie, Regina Cassandra, Regina Cassandra And Nivetha Thomas Shakini Dakini Movie, Saakini Daakini, Saakini Daakini Movie 2022, Shakini Dakini Movie, Shakini Dakini Movie Latest News And Updates, Shakini Dakini Movie Latest Update, Shakini Dakini Movie New Update, Shakini Dakini Telugu Movie, Sudheer Varma, Telugu Film News 2022, Telugu Filmnagar, Thriller movie Shakini Dakini, Tollywood Latest, Tollywood Movie Updates

సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిస్తున్న సినిమా ‘శాకిని డాకిని’. కొరియ‌న్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమా పైన ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. సెప్టెంబర్ 16న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఈసందర్బంగా టీమ్ ప్రెస్ మీట్ లో పాల్గొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. ‘శాకిని డాకిని’ కొరియన్ ఫిల్మ్ రీమేక్. తెలుగు నేటివిటీ తగ్గట్టు అద్భుతంగా మలిచాం. ఈ సినిమా నా కెరియర్ లో ఒక మైలు రాయి. ‘శాకిని డాకిని’ లో యాక్షన్ కామెడీ తో పాటు సమాజానికి మంచి సందేశం వుంటుంది. కథానాయకులు గా ఇద్దరు హీరోయిన్స్ వుండటం ఖచ్చితంగా కొత్తగా వుంది. మాపై నమ్మకంతో ఈ సినిమా చేసిన సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ కి కృతజ్ఞతలు. కదిలే కదిలే పాట ఈ సినిమా కథకి అద్దం పడుతుంది. ఈ పాట చూసిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మహిళలు ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తారనే నమ్మకం వుంది. సెప్టెంబర్ 16న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ థియేటర్లో సినిమా చూడాలి” అని కోరారు.

నివేదా థామస్ మాట్లాడుతూ.. బ్రోచేవారెవరు సినిమా సమయంలో సురేష్ బాబు గారు పరిచమయ్యారు. సినిమా గురించి చాలా చక్కని విషయాలు చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ యూనిక్ సినిమాలకు పెట్టింది పేరు. ‘శాకిని డాకిని’ కథాచర్చల్లో పాల్గొన్నప్పుడే సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. అలాగే థీమ్ సాంగ్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘శాకిని డాకిని’ కెమిస్ట్రీ ఈ థీమ్ సాంగ్ లో చూశారు. ఇందులో నేను రెజీనా చాలా డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నాం. చిరాకుతో కూడిన ఫన్ రిలేషన్స్ అది. టీజర్, థీమ్ సాంగ్ లో మా కెమిస్ట్రీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా లో అది ఇంకా బావుంటుంది. సెప్టెంబర్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ లో చూడాలి” అని కోరారు.

సునీత తాటి మాట్లాడుతూ.. ఏ సినిమా అయినా చేయడానికి నాకు మూడు ముఖ్యమైన ఎలిమెంట్స్ అనిపిస్తాయి. కథ, కథానాయకులు, కథని ఎందుకు చేస్తున్నామనే స్ఫూర్తి. ‘శాకిని డాకిని’లో ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక క్రైమ్ ని డీల్ చేస్తారనేది కథ. ఈ కథ మొదటి నుండి మాకు చాలా నచ్చింది. ఈ కథ విషయంలో మాకు చాలా నమ్మకం వుంది.ఒక ఆడ పిల్ల పుడితే ఆమె మొదటి పాత్ర కూతురు. అలాంటి ఒక కూతురిని దగ్గర పెట్టుకొని కొన్ని సినిమాలు చూడలేకపోతున్నాం. కానీ ఈ సినిమాలో అలాంటి కూతురు దగ్గర వున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. సురేష్ బాబు గారి సహకారంతో ఈ సినిమాని చేశాం. సినిమాలో నివేదా పంచ్ లు, రెజీనా కిక్కులు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. సినిమాని ఇంటర్ నేషనల్ స్థాయిలో ఎక్కడా రాజీపడకుండా తీశాం. రెజీనా, నివేదా చాలా హార్డ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 16న సినిమాని విడుదల చేస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది” అన్నారు.

కొరియన్ సినిమాలు ఎక్కువగా తీయడానికి కారణం ?

సునీత తాటి : కథ పరంగా ఒక స్పేస్ లో వున్నాం. కొత్త కథలు ఎక్కడ వున్నాయని అడుగుతుంటారు. అయితే అడాప్ట్ చేయడం కూడా అంత తేలిక కాదు. ఒక ఎమోషన్ ని తీసుకొని కల్చర్ యాడ్ చేయడం కూడా ఒక ప్రయాణం. ఈ కథని యువకుడైన అక్షయ్ అద్భుతంగా స్క్రీన్ ప్లే చేశాడు.

ఈ కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ?

నివేదా థామస్ : తెలుగులో చేస్తున్నామని తెలిసిన తర్వాత మిడ్ నైట్ రన్నర్స్ చూశాను. అందులో పాత్ర నాలానే వుంది. నాకు తెలియకుండా నా పాత్రతో స్క్రీన్ ప్లే చేసి సినిమా తీశారా అనిపించింది. ఈ పాత్ర మీరే చేస్తున్నారని చెప్పారు. పెద్దగా కష్టపడటం అవసరం లేదనిపించింది. కొంచెం తెలంగాణ యాస చక్కగా నేర్చుకొని నాలాగ వుంటే సరిపొతుందనిపించింది. అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.

యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది ?

రెజీనా: నా మొదటి సినిమా నుండి యాక్షన్ చేయడం నాకు చాలా ఇష్టం. మొత్తానికి ఈ సినిమాతో ఆ అవకాశం వచ్చింది. వెంకట్ మాస్టర్ అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారు. యాక్షన్ సీన్స్ ని చాలా ఎంజాయ్ చేశాను. యాక్షన్ విషయంలో విజయశాంతి లాంటి హీరోయిన్స్ స్ఫూర్తి ఎప్పుడూ వుంటుంది. ఇలాంటి యాక్షన్ పాత్రలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటింగా ఎదురుచూస్తున్నాను.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 18 =