ఇండియన్ కూల్ కెప్టెన్ ధోనీ బయోపిక్ చేద్దామని అనుకున్నాను కానీ సుషాంత్ చేసేశాడు.. విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తా అంటున్నాడు టాలీవుడ్ సెన్సేషనల్ అండ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్ గానే విజయ్ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను విడుదల చేశారు. అయితే ఈసినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద రన్ అవుతుంది. విజయ్ కు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో అక్కడ బాగానే ఆదరణ పొందుతుంది. అక్కడ బాగానే ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తున్నది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా.. నిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ మరియు పాకిస్తాన్ టీం ల మధ్య టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ మ్యాచ్ లో ఇండియా గెలుపును సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ కి రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యాడు. మ్యాచ్ చివరి వరకు ఉండి ఇండియా గెలుపుని విజయ్ దేవరకొండ ఆస్వాదించడం జరిగింది. అంతేకాదు అక్కడ హోస్ట్ లతో అలానే కామెంటేటర్ లతో కూడా మాట్లాడి సందడి చేశారు. ఈసందర్భంగా కామెంటేటర్ విజయ్ దేవరకొండను మీరు ఏ క్రికెటర్ బయోపిక్ తీయాలనుకుంటున్నారు అని అడుగగా.. ధోనీ బయోపిక్ చేద్దామని అనుకున్నాను కానీ సుషాంత్ చేసేశాడు.. అయితే విరాట్ కోహ్లీ బయోపిక్ తీయాలన్న ఆలోచన ఉన్నట్టు చెప్పాడు. మరి చూద్దాం విజయ్ తన కోరికను త్వరలోనే తీర్చుకుంటాడేమో.
ఇక ఇదిలాఉండగా విజయ్ దేవకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమన సినిమా చేస్తున్నాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది. ఇంకా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. సమంత ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈసినిమాపై మరింత క్రేజ్ మొదలైంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: