బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : నాగార్జున సినీ కెరీర్ లో బెస్ట్ మూవీ ?

Birthday Special Poll Game Best Movie In Nagarjuna's Cine Carrer, Best Movie In Nagarjuna's Cine Carrer, Nagarjuna's Birthday Special Poll Game, Special Poll Game, Poll Game, Nagarjuna's Birthday Special, Akkineni Nagarjuna Best Movies, Nagarjuna's Cine Carrer, Akkineni Nagarjuna, Nagarjuna Movies, Happy Birthday Nagarjuna, Best Movies In Nagarjuna's Cine Carrer, nagarjuna hit movies list, nagarjuna movies latest, Akkineni Nagarjuna Latest News And Updates, Tollywood Movie Updates, Tollywood Latest News, Telugu Filmnagar, Telugu Film News 2022,

గీతాంజలి: భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై మణిరత్నం దర్శకత్వం లో నాగార్జున హీరోగా తెరకెక్కిన గీతాంజలి మూవీ 1989 మే 19 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో నాగార్జున అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇళయరాజా స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూత లూగించాయి. గీతాంజలి మూవీ బెస్ట్ మూవీ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. తమిళ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెలుగు లో దర్శకత్వం వహించిన ఫస్ట్ &లాస్ట్ మూవీ గీతాంజలి కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శివ : అన్నపూర్ణ స్టూడియోస్ , ఎస్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన గ్యాంగ్ స్టర్ మూవీ శివ  1989 అక్టోబర్ 5 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా నంది ,ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ 5సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడింది. శివ మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన వర్మ బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. శివ మూవీ హిందీ రీమేక్ తో దర్శకుడు వర్మ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

హలో బ్రదర్ : శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై EVV సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ హలో బ్రదర్ మూవీ 1994 ఏప్రిల్ 20 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో హీరో నాగార్జున ద్విపాత్రాభినయం చేశారు. రెండు పాత్రలలోనూ నాగార్జున అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజ్ కోటి స్వరకల్పనలో రూపొందిన సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి.

నిన్నే పెళ్ళాడతా : అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణ వంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నిన్నే పెళ్ళాడతా మూవీ 1996 అక్టోబర్ 4వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీ అద్భుత కుటుంబ కథా చిత్రం గా ప్రేక్షకాదరణ పొందింది. హీరో నాగార్జున సినీ కెరీర్ లో ఒక మైలురాయి గా నిలిచింది. సందీప్ చౌతా స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అన్నమయ్య : వి ఎం సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన బయోగ్రాఫికల్ ఫిల్మ్ అన్నమయ్య మూవీ 1997 మే 22 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2 నేషనల్ , 3 ఫిల్మ్ ఫేర్ , 8 నంది అవార్డ్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో నాగార్జున అన్నమయ్య పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కీరవాణి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాగార్జున సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.

మన్మథుడు : అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ మన్మథుడు 2002 డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి నాగార్జున సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకుల వీనుల విందు చేసింది. హీరో నాగార్జున పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మన్మథుడు మూవీ కి డైలాగ్స్ అందించడం విశేషం.

సోగ్గాడే చిన్ని నాయనా : అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరో గా రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా సోగ్గాడే చిన్ని నాయనా మూవీ 2016 జనవరి 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా TSR – TV 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బంగార్రాజు : జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ సోగ్గాడే చిన్నినాయనా మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన బంగార్రాజు మూవీ 2022 జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటించారు. హీరోలు నాగార్జున , నాగచైతన్యలు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : నాగార్జున సినీ కెరీర్ లో బెస్ట్ మూవీ ?

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here