సూరరై పోట్రు హిందీ రీమేక్ థియేటర్లలోనే

Soorarai pottru makers give clarity about hindi remake, Soorarai pottru hindi remake, Soorarai pottru makers give clarity, Hindi remake of Soorarai Pottru, soorarai pottru hindi version, remake of soorarai pottru, soorarai pottru hindi remake cast, Soorarai pottru Latest News And Updates, soorarai pottru, Tollywood Movie Updates, Tollywood Latest News, Telugu Filmnagar, Telugu Film News 2022, Latest Telugu Movies News,

సౌత్ సినిమాలు నార్త్ లో ఎంత ప్రభంజనం చూపిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక ఓటీటీ వల్ల తెలుగు, తమిళ్ తో కన్నడ, మలయాళం సినిమాలు కూడా ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో సౌత్ సినిమాలకు నార్త్ లో కూడా మంచి డిమాండ్ పెరిగింది. దానికి తోడు బాలీవుడ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతున్నాయి. ఈరెండేళ్లలోనే సక్సెస్ రేటు చాలా వరకూ పడిపోయింది. దీంతో సౌత్ లో హిట్ అయిన సినిమాలను నార్త్ లో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే పలు సినిమాలు నార్త్ లో రీమేక్ అవుతున్నాయి. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా ‘సూరరై పోట్రు’ సినిమా కూడా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు తెరకెక్కింది. కరోనా వల్ల ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా కూడా ఈసినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈసినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈసినిమా ఆస్కార్ బరిలోకి కూడా వెళ్లింది. తెలుగులో కూడా ఆకాశం నీ హద్దురా టైటిల్ తో రిలీజ్ అయింది.

ఇక ఈసినిమాను హిందీ లో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా సూర్య, అబుడాంటియా ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈసినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే తాజాగా ఒక రూమర్ తెరపైకి వచ్చింది. ఈ హిందీ రీమేక్ ను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈవార్తలను మేకర్స్ ఖండించారు. తమ ట్విట్టర్ వేదికగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ అంటూ వచ్చిన కథనంలో ఎలాంటి నిజం లేదు.. థియేటర్లలోనే రిలీజ్ అవుతుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.. పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి చూస్తున్నాం.. ఇలాంటి కథనాలే రాసేముందు ఒకసారి వెరిఫై చేసుకోవాలని కౌంటర్ ఇచ్చారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =