ప్రస్తుతం రిలీజ్ కు ఉన్న సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా లైగర్. పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఈ క్రేజీ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈసినిమాలో ఉన్నఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరీ-విజయ్ కాంబినేషన్
ఈసినిమాకు ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణాల్లో పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఒకటి. పూరీ లాంటి బోల్డ్ డైరెక్టర్ తో విజయ్ లాంటి బోల్డ్ హీరో చేస్తే ఎలా ఉంటుందో.. ఆ కాంబినేషన్ చూడటానికి ఎంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక హీరోలోని హీరోయిజాన్ని కానీ ఏ విషయాన్ని అయినా డైలాగ్స్ తో స్ట్రయిట్ ఫార్వడ్ చెప్పడం పూరీ స్పెషల్. అందుకే ఈసినిమా ప్రకటించిన దగ్గర నుండే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్
ఈసినిమాలో మరో హైలెట్ ఎలిమెంట్స్ మైక్ టైసన్. మొదటిసారి మైక్ టైసన్ ఈసినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఈసినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి.. మైక్ టైసన్ బాక్సింగ్ లెజెండ్ కాబట్టి పూరీ ఈసినిమా కోసం ఆయన్ని ఒప్పించి ఈసినిమా కోసం తీసుకొస్తున్నాడు. ఆయన పంచ్ పవర్ ను మరోసారి సినీ ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ఇక బాక్సింగ్ దిగ్గజం అయిన మైక్ టైసన్ కూడా పాత్ర నిడివి తక్కువ అయినా కానీ ఈసినిమా చేయడానికి ఒప్పుకోవడం అనేది అభినందించాల్సిన విషయం.
ప్రొడక్షన్
ఈసినిమా పూరీ దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే పూరీ కనెక్ట్స్ నుండి వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పుడు అదే బ్యానర్ నుండి ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై కూడా అందరిలో ఆసక్తి నెలకొంది.ఇక హిందీ వెర్షన్ కు వచ్చేసరికి ధర్మా ప్రొడక్షన్స్ కూడా కలిసింది. నార్త్ లో ఈసినిమాకు ఆ మాత్రం హైప్ రావాలంటే కరణ్ లాంటి వాళ్లు కూడా ఉండాల్సిందే. అలా ఈసినిమాకు ధర్మా ప్రొడక్షన్ కూడా యాడ్ అవ్వడం కలిసొచ్చిన అంశం.
అనన్య, రమ్యకృష్ణ
ఈసినిమాలో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే పాటల్లో అలానే ట్రైలర్ లో చూశాం విజయ్-అనన్య కెమిస్ట్రీ ఈసినిమాకు బాగానే ప్లస్ పాయింట్ అవుతుందని అర్థమవుతుంది. మరోవైపు విజయ్ కు తల్లి పాత్రలో నటించిన రమ్యకృష్ణ కూడా ఈసినిమాకు మరో హైలెట్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పటివరకూ రమ్యకృష్ణ అంత మాస్ పాత్రలో కనిపించింది లేదు. విజయ్ తల్లిగా రమ్యకృష్ణ మాస్ పాత్రలో ఇరగదీయనున్నట్టు అర్థమవుతుంది.
మరి ఈసినిమా ఎన్ని సంచలనాలు సృష్టింస్తుందో తెలియాలంటే ఇంకొక్క రోజు ఆగాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: