చెన్నైలో జవాన్ కొత్త షెడ్యూల్

Shah Rukh Khan Jawaan Movie Latest Schedule To Happen In Chennai,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Jawaan, Jawaan Hindi Movie, Jawaan Movie Latest Updates, Jawaan Movie Latest Schedule in Chennai, Jawaan Movie Shooting Schedule at Chennai, Shah Rukh Khan,Bollywood Badshah,Bollywood Badshah Shah Rukh Khan,Shah Rukh Upcoing Movies,Shah Rukh Khan New Movie Updates,Shah Rukh Khan latest Movie Updates,Shah Rukh Khan Jawaan Movie Latest Updates

ప్రస్తుతం సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చాయి. ఏ ఇండస్ట్రీ హీరోలు ఆ ఇండస్ట్రీకే పరిమితమవ్వడం లేదు. తెలుగు హీరోలు పలు ఇండస్ట్రీల్లోకి వెళుతున్నారు.. ఇతర ఇండస్ట్రీ హీరోలు కూడా మన డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అలా ఇప్పటికే ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ వస్తున్నాయి. అందులో తమిళ్ డైరెక్టర్ అట్లీ ఇంకా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కాంబినేషన్ కూడా. అట్లీ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.. మరోవైపు షారుఖ్ కు సరైన హిట్ అంది చాలా కాలం అవుతుంది. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జవాన్. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈసినిమా కొత్త షెడ్యూల్ ను నేడు చెన్నైలో మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. నేటి నుండి ఓ కొత్త షెడ్యూల్ ను అక్కడ మొదలుపెట్టనున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో షారుక్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకటి ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తుండగా.. మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై గౌరీఖాన్‌ నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్‌ 2న రిలీజ్‌ చేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + fourteen =